వేద న్యూస్, పార్వతిపురం:
కొమరాడ మండలంలో మాదలంగి కొమరాడ కూనే రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆశ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమావేశాలలో సిఐటియు నాయకులు పాల్గొని ప్రసంగించారు. గ్రామీ ణ పట్టణ ప్రాంతాలలో వైద్య ఆరోగ్య రంగ సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు సమస్యల పట్ల మాత్రం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో స్పందించడం లేదని విమర్శించారు. పేద ప్రజలకు ఎంతో శ్రమతో సేవలందిస్తున్న ఆశ,కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా మహాసభ జయప్రదం చేయాలని కోరారు.