కామన్ గా మారుతున్న మందుబాబుల గొడవలు.!
మౌనం వహిస్తున్న బెల్ట్ షాప్ ఓనర్లు.!
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత శాఖ అధికారులు.!
వేద న్యూస్ ,ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలోని బెల్ట్ షాపులలో మందుబాబులు మద్యం సేవించి మత్తులో తూలుతూ, ఘర్షణ పడుతూ గొడవలకు దిగుతున్నారు. ఇలా బెల్ట్ షాపుల వద్ద మందుబాబుల గొడవలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ గొడవలతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా మందుబాబుల గొడవలు రోజు రోజుకి సమాజంలో కామన్ గా మారుతున్నాయి. ఇలా గ్రామాలలోని బెల్ట్ షాపుల వద్ద మందుబాబులు మద్యం మత్తులో ఇలా గొడవలకు దిగే విషయంపై బెల్ట్ షాప్ ఓనర్లు ఎలాంటి బాధ్యత లేనట్లు మౌనంగా ఉంటున్నారు. అంతేకాకుండా సంబంధిత శాఖ అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, చూసి చూడనట్లు సమస్యను పట్టించుకోవడంలేదని, ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. ఇల్లంతకుంట మండలంలో 33 గ్రామపంచాయతీలు ఉన్నాయి.వీటి పరిధిలో ఎన్నో బెల్ట్ షాపులు నడుస్తున్నా, ఇలాంటి ఎన్నోసంఘటనలు ప్రతిరోజు జరుగుతున్న కూడా దీనిపైన బెల్ట్ షాప్ ఓనర్లు గాని, సంబంధిత శాఖ అధికారులు గానీ, శ్రద్ధ చూపెట్టకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, మందుబాబుల గొడవలకు కారణమవుతున్నారని, యావత్ మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా గొడవలకు దిగే క్రమంలో మందుబాబులు ఒక్కొక్కసారి తమ ప్రాణాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఇలా జరిగితే వారి కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి. ఇలా మండలంలోని గ్రామాల బెల్ట్ షాపులపై అధికారులు ఎందుకు దృష్టి పెట్టడం లేదు.? తమ బెల్ట్ షాపులో మందుబాబుల మధ్య ఎంత గొడవ జరిగినా కూడా బెల్ట్ షాప్ ఓనర్ మౌనంగా ఉండడం ఎందుకు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపైన సంబంధిత శాఖ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అధికారులకు ఏదో ఒక లాభం ఉంటేనే కదా వారు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించేది. మరి మండలంలోని గ్రామాలలో ఎన్ని బెల్ట్ షాపులు పుట్టగొడుగుల వెలిసి నడుస్తున్న కూడా వారు చూస్తూ ఎలా ఉంటున్నారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కావున రాపాక గ్రామంలోని బెల్ట్ షాపులో నిత్యం మందుబాబుల మధ్య గొడవలకు కారణమవుతున్న బెల్టుషాపులపై, బెల్ట్ షాప్ ఓనర్లపై సంబంధిత శాఖ ఉన్నత అధికారులు దృష్టి సారించి గ్రామాలలో మందుబాబుల గొడవల వలన సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసి, నిబంధనలు అతిక్రమించిన షాప్ ఓనర్లపై, షాపులపై, ఈ విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోని గ్రామాలలోని సామాన్య ప్రజలకు ప్రశాంత వాతావరణము కల్పించాలని మండలం ప్రజలు కోరుతున్నారు.