వేద న్యూస్, ఇబ్రహీంపట్నం:

ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను సోమవారం ఘనంగా ప్రారంభించారు. దేవి శరన్నవరాత్రోత్సవాలను ముదిరాజ్ దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు ఏకరూప దుస్తులు ధరించి భవానీ దీక్షలు చేపట్టారు.

అమ్మవారి విగ్రహాన్ని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర నుండి అల్లూరి సీతా రామరాజు రోడ్డు వరకు శోభయాత్రగా తరలించి మండపంలో ప్రతిష్ఠించారు.

వేదమంత్రాల మధ్య భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అమ్మవారి సేవలో పాలుపంచుకున్నారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారి నామస్మరణతో భక్తులు సేవలో తరించనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.