వేద న్యూస్, కరీంనగర్ :
సోమవారం (నేడు)నుంచి ప్రారంభమైన శ్రీ దేవి నవరాత్రోత్సవాల సందర్భంగా కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అమ్మవారి దీక్ష స్వీకరించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజల్లో పాల్గొని వేదపండితుల ఆధ్వర్యంలో అమ్మవారి దీక్షను స్వీకరించారు. తెలంగాణ ప్రజలతో పాటు యావత్ అఖండ భారతీయులు సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆ దేవి మాత దీవించాలని ప్రార్థించారు.