- ఎన్విరాన్‌మెంటల్ అండ్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ సభ్యులు
వేద న్యూస్, నాగర్‌కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అండ్ రేంజ్ ముక్డికిగుండం గ్రామ పరిసర ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారిపై దాడిని ఖండిస్తున్నట్టు ఎన్విరాన్‌మెంటల్ అండ్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ ప్రెసిడెంట్ ఎస్.సునీత, సభ్యులు పేర్కొన్నారు.
తమ విధి నిర్వహణలో భాగంగా డ్యూటీ చేస్తున్న అటవీ శాఖ వారిపై దాడి సరికాదన్నారు. దాడి విషయమై సమీప కొల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫారెస్ట్ శాఖ వారు ఫిర్యాదు చేయగా, తూతూమంత్రంగా కేసు నమోదు చేస్తామని చెప్పి.. రాజకీయ ఒత్తిళ్లకు పోలీస్ వారు తలొగ్గారని ఆరోపించారు.
ఈ విషయమై పిసిసిఎఫ్ ఏలుసింగ్ మేరు స్పందించాలని, వారిపై తగు చర్యలు తీసుకునేలా చూడాలని డిమాండ్ చేశారు.