వేద న్యూస్, మెట్ పల్లి:

గణేశుడు… ” హరిత” వినాయకుడీ గా  దర్శనమిచ్చారు. గంగం గణేషుడు.. పచ్చని ప్రకృతి ఆకృతి రూపం దాల్చినట్టుగా భావిస్తున్నామని కొందరు భక్తులు పేర్కొన్నారు.

మెట్ పల్లి మండలం మేడిపల్లి గ్రామ శివారులో  వెంకటేశ్వర గుడి ఆవరణలో గుడి దర్శనానికి వచ్చిన బెజ్జారపు నాగరాజు అనే భక్తుడికి శుక్రవారం మర్రిచెట్టు లో వినాయకుడి ఆకారంలో కనబడింది.

వెంటనే గుడి ప్రధాన అర్చకులు కిషోర్ కి తెలియజేశారు. అనంతరం అర్చకుల తోపాటు భక్తులు వినాయకుడి ఆకృతిలో ఉన్న మర్రి చెట్టును దర్శించుకున్నారు.