• స్మార్ట్ ఫోన్ల యూజర్లు బీ అలర్ట్: ఎస్ఐ సిరిసిల్ల అశోక్

వేద న్యూస్, ఇల్లంతకుంట:

స్మార్ట్ ఫోన్ల యూజర్లు అయిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు యాప్స్ లింక్స్ పంపించి ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు. 

వాట్సాప్ గ్రూపులలో ‘‘పీఎం కిసాన్’, ఎస్బిఐ రివార్డ్,  క్రెడిట్ కార్డ్ పేరిట వివిధ రూపాల్లో  యాప్స్ పంపించి.. వాటి ద్వారా ఫోన్ ను హ్యాక్  చేస్తున్నారని వివరించారు. తద్వారా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా  అకౌంట్లలోని డబ్బులు దోచేస్తున్నారని వివరించారు. మండల ప్రజలు వాట్సాప్ గ్రూప్‌లలో వచ్చే లింకులు డౌన్‌లో‌డ్ చేసుకోవద్దని వెల్లడించారు. అలాంటివి ఏమైనా గ్రూపులలో వస్తే అడ్మిన్ వాటిని చూసి డిలీట్ చేయాలని సూచించారు.