వేద న్యూస్, ఆల్విన్ కాలనీ:
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్-1 కాలనీవాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల‌పై పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ‌ని మంగళవారం కలిశారు. వివేకానంద‌నగర్ లోని వారి ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యల పరిష్కారంపై గాంధీ సానుకూలంగా స్పందించినట్టు కాలనీవాసులు వెల్లడించారు.

వారు మాట్లాడుతూ.. కాలనీలో మౌలిక వసతులు కలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అదేవిధంగా కాలనీలలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని కోరారు.

అవసరమున్న చోట యూజీడీ పైప్ లైన్లు వేయాలని, విధి దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు. గాంధీ మాట్లాడుతూ.. త్వరలోనే ఆల్విన్ కాలనీ ఫేస్-1 కాలనీలో పర్యటిస్తానని చెప్పారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ ఫేస్-1 కాలనీ ప్రెసిడెంట్ వెంకటేశం గౌడ్, జనరల్ సెక్రెటరీ కుమారచారి, జాయింట్ సెక్రెటరీ రఘు, కల్చరల్ సెక్రెటరీ హేమలత, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.