చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లోకేష్ కుమార్

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సిసిఎల్ఏ

వేద న్యూస్ ,రాజన్న సిరిసిల్ల:

భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లోకేష్ కుమార్ తెలిపారు.మంగళవారం సిసిఏల్ఏ లోకేష్ కుమార్ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం పై అదనపు కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారుఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.ఈ సందర్భంగా చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ, రెవెన్యూ సదస్సులో భూ సమస్యల పరిష్కారానికి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.
ఫైల్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ పద్ధతి లో ప్రొసీజర్ ప్రకారం మాత్రమే నిర్వహించాలని, త్వోరలో దరఖాస్తు పెండింగ్ ఎక్కడ ఉన్నది చెక్ చేసుకునే అవకాశం ప్రజలకు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. హై కోర్టు నుంచి వచ్చే తీర్పు మేరకు సాధా బైనామా దరఖాస్తులు పరిష్కారం చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం వాటినిమినహాయించి మిగిలిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత కల్పించాలని అన్నారు ‌.ఈ సమావేశంలో సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ అధికారీ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ డి సెక్షన్ సూపర్డెంట్ రామచంద్రం, సంబంధిత సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.