వేద న్యూస్, ఇల్లందకుంట:
హైదరాబాద్‌లో మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదను శుక్రవారం మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇల్లందకుంట సీతారామ చంద్రస్వామి దేవస్థానం చైర్మెన్ ఇంగిలే రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి.. శాలువాతో సన్మానం చేశారు.
అనంతరం సీతారామచంద్రస్వామి దేవస్థానం చిత్రపటం, లడ్డు, స్వామివారి ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ మహిళా కమిషన్ చైర్మన్ ను దేవస్థాన దర్శనం కోసం రావాల్సిందిగా కోరినట్టు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్త గోడిశాల పరమేశ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సలీం, ఎండీ లాల్ తదితరులు పాల్గొన్నారు.