• సదరు కాలువలోనే చనిపోయిన పంది.. 4రోజులుగా దుర్వాసన
  •  పట్టించుకోని పంచాయితీ అధికారులు
    వేద న్యూస్, వరంగల్ :

 ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం గ్రామాలకు మండలానికి ఒక ప్రత్యేక అధికారితో పాటు మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారులను నియమించింది. కాగా, ప్రత్యేక అధికారుల పాలనలో ధర్మసాగర్ మండలంలోని గ్రామీణ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయింది. గ్రామంలోని ఏ వీధి చూసినా పారిశుధ్య లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. వ్యాధులు ప్రబలడంతో పాటు మురుగు చెత్తాచెదారం పేరుకుపోతున్నాయి.

4రోజుల క్రితం కురిసిన వర్షానికి ధర్మసాగర్ మండలకేంద్రం లోని ఎస్సీ కాలనీలో ఎర్రజెండా సర్కిల్​ దగ్గర మురికి కాల్వల్లో నీరంంతా నిలిచి పోయి ఆ ప్రాంతమంతా చేరింది. ఒక వ్యక్తి ఇల్లు నిర్మాణం కోసం తన ఇంటి ముందు ఉన్న మురికి కాలువను ధ్వంసం చేశారని తెలుస్తోంది.  సదరు కాలువలో పంది చనిపోయి.. కుల్లిపోయి దుర్వాసన ఆ ప్రాంతం అంతా వ్యాపిస్తోంది. అయినా కూడా పంచాయితీ అధికారులు పట్టించుకోవడంలేదని జనం ఆరోపిస్తున్నారు. 

పంచాయతీ ఆఫీసులో కొందరు వ్యక్తులకు ఎలాంటి పనులు చెప్పకుండా కొందరిని మాత్రమే ఎక్కువ పని చేపిస్తున్నారని పారిశుధ్య కార్మికులు కొందరు గుసగుసలాడుకుంటున్నట్టు వినికిడి. ఆదే వీధిలో నలుగురు పారిశుధ్య కార్మికులు ఉన్నా పట్టించుకోవడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు.