వేద న్యూస్, వనపర్తి :
పిన్నచర్ల,మూలమళ్ళ, బాలకిష్టాపూర్, ఆరెపల్లి, తూంపల్లి గ్రామాల సర్పంచ్ అభ్యర్థులుగా భారతీయ జనతా పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేయటం జరిగింది. మూలమల బిజెపి అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి, బాలకృష్ణ పురం బిజెపి అభ్యర్థిగా మస్సన, పిన్నించర్ల బిజెపి అభ్యర్థిగా లక్ష్మి, తూంపల్లి బిజెపి అభ్యర్థిగా పరశురాములు, ఈ నామినేషన్ల కార్యక్రమానికి
బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆంజనేయులు, ముదిరాజ్
ఆత్మకూరు మున్సిపల్ అధ్యక్షుడు సూరి, బిజెపి జిల్లా నాయకులు ఆనంద్, బిజెపి మాజీ అధ్యక్షుడు తంబలి విజయ్ వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.