• బీజేపీ నాయకుడు చల్లా నారాయణరెడ్డి

వేద న్యూస్, కాటారం:

మహదేవపూర్ మండలం బీరసాగర్ గ్రామానికి చెందిన జైన మధునయ్య ఉట్లపల్లికి వెళ్లి వేస్తున్న క్రమంలో జీరో లారీలతో అక్రమంగా రవాణా చేస్తున్న క్రమంలో లారీ ఢీ కొట్టి అక్కడికక్కడే మరణించారని బీజేపీ నాయకుడు చల్లా నారాయణరెడ్డి తెలిపారు.

ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు అక్రమంగా సాండ్ మాఫియా జరుగుతుందని, తమ ప్రభుత్వం వచ్చాక ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నిషేధిస్తామని ఉచిత హామీలు ఇచ్చి  శ్రీధర్ బాబు అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక అక్రమ రావణాలకు మంథని, కాళేశ్వరం, మహదేవపూర్, కాటారం ప్రాంతాలు అడ్డాగా మారాయన్నారు.

యాక్సిడెంట్ లో మరణించిన జైన మధునయ్య కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మృతుని కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్సగ్రేషియా ఇవ్వాలని, బీజేపీ తరఫున డిమాండ్ చేశారు.

మృతుని కుటుంబానికి బీజేపీ పక్షాన తోడుగా ఉంటామని, కొట్లాడుతామని ప్రకటించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలు ఢీ కొట్టి మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మహదేవపూర్ మాజీ ఎంపీటీసీ చాగర్ల రవీందర్, కక్కు శ్రీనివాస్, ఐలయ్య యాదవ్, మనోజ్,జనగాం పోశం,రాకేష్, జోగేష్, సుమన్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.