– హుస్నాబాద్ ఎంఈవో ఆఫీసు పరిసరాల్లో బీజేపీ నేతల శ్రమదానం
– చెత్త, పిచ్చి మొక్కలను తొలగించి ఆఫీసును నీట్‌గా చేసిన నాయకులు
– ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేఎస్ఆర్
వేద న్యూస్, హుస్నాబాద్:
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన దేశం చెత్త రహిత భారతదేశం కావాలనే లక్ష్యంతో స్వచ్ఛ భారత్ 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రజలు, యువకులు, అందరూ భాగస్వాములై విధంగా ఒక్క గంట శ్రమదానం చేయాలని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆదివారం హుస్నాబాద్ పట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో మొత్తం చెత్త, పిచ్చి మొక్కలతో ఉండగా..బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు అందరూ కలిసి ఎంఈఓ ఆఫీస్ లోని చెత్త, పిచ్చిమొక్కలు, గడ్డిని తొలగించారు.

అనంతరం ఆఫీసును శుభ్రంగా ఊడిచి 2 గంటల పాటు శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరూ వారివారి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రతీ ఒక్కరు గంట శ్రమదానం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వృక్షప్రసాదదాత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి (జేఎస్ఆఱ్) హాజరై, శ్రమదానం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ లక్కిరెడ్డి తిరుమల, జిల్లా కోశాధికారి, కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ మ్యాదరబోయిన వేణు యాదవ్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తోట స్వరూప, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి సతీష్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బొనగిరి రవి, పట్టణ ప్రధాన కార్యదర్శి తోట సమ్మయ్య, ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, బోగా మహేష్కర్, బీజేవైయం పట్టణ అధ్యక్షుడు బొప్పిశెట్టి భీమేశ్వర్, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు వేల్పుల నాగార్జున్, బీజేవైయం పట్టణ ప్రధాన కార్యదర్శి ఎగ్గోజు రాజు, అధికార ప్రతినిధి ఆశాడపు శ్రీనివాస్, కార్యదర్శి అబ్బిడి లింగారెడ్డి, మహిళా మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి లకవత్ శారద, బీజేపీ నాయకులు పెందోట భూశంకరాచారీ, లక్ష్మయ్య, బుర్ర రాజు, నారోజు నరేష్, ఎర్రోజు సాయికృష్ణ, అశోక్, అంజి, ప్రభాస్, భగవాన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.