BJP leaders who joined BRS..!

వేదన్యూస్ – జహీరాబాద్

భారత రాష్ట్ర సమితి పార్టీలో భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు చేరారు. రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన సీడీసీ మాజీ చైర్మన్ ఉమకాంత్ పటేల్ , సహాకార సంఘం మాజీ అధ్యక్షులు బస్వరాజు, మాజీ ఎంపీటీసీలు విజయేందర్ రెడ్డి, సంతోష్ పాటిల్, బీజేపీ సీనియర్ నేతలు సుభాష్ రావు, భూమయ్య ,లక్ష్మణ్ తో పాటు భారీ సంఖ్యలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సమక్షంలో స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు ఆధ్వర్యంలో  గులాబీ కండువా కప్పుకున్నారు.

వీరందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు మాజీ మంత్రి హారీష్ రావు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ ” జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే. ఆరు గ్యారంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి హాక్కుగా రావాల్సిన నిధులు సైతం ఇవ్వడం లేదు. రాష్ట్రంలో అవినీతి అరాచక పాలన సాగుతున్న చీమ కుట్టినట్లు కూడా లేదు. తెలంగాణ ప్రజలు జాతీయ పార్టీల గుణాన్ని తెలుస్కున్నారు. భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదే. అందుకే బీజేపీ నుండి బీఆర్ఎస్ లో చేరారు అని వ్యాఖ్యానించారు.