వేద న్యూస్, ఎల్కతుర్తి:
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ను గురువారం బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడితాడి చిరంజీవి ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ఆ పార్టీ అధ్యక్షులు కలిశారు.
ఈ సందర్భంగా బీజేపీ హుస్నాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన, చేపడుతున్న కార్యక్రమాలను గురించి బండికి వివరించినట్లు చిరంజీవి తెలిపారు. పార్టీ పరిస్థితులపై ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆయా మండలాల పార్టీ అధ్యక్షులను ఆరా తీశారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ సర్కారేనని ఈ సందర్భంగా నేతలు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై బండి దిశానిర్దేశం చేసినట్లు చిరంజీవి పేర్కొన్నారు.