- మరిపెడ మున్సిపల్ ఎన్నికలు
వేద న్యూస్, మరిపెడ:
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఐదో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడ రవి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలుసుకుని కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ ర్యాలీ చేపట్టారు.
ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలనీలు, వీధులు సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, యువ నాయకుడు నూకల అభినవ్ రెడ్డి, మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్, మాజీ సర్పంచ్ లక్ష్మీపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సర్వర్ సయ్యద్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.