వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ మండలం,బీచ్ రాజ్ పల్లి లో మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ని మున్సిపాలిటీలోని గెలుపొందిన 10వ వార్డు ,11వ వార్డు మరిపెడ కౌన్సిలర్లు బాదావతి బేబి రవి, లావుడ్య సత్యవతి యుగేంధర్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నవీన్ రావు ..వారిని శాలువాతో సన్మానించి,అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే వారి గెలుపుకోసం రాత్రింబవళ్ళు కష్ట పడిన నాయకులను,యువకులను, మహిళలను, కార్యకర్తలను శాలువతో సన్మానించి, అభినందించారు.
వారి వెంట మాజీ కౌన్సిలర్ ఎడెల్లి పరుశురాములు , వార్డు ఇంచార్జ్ మంద వెంకన్న ,ఎడెల్లి సైదులు, భాషిపంగు సురేష్,ఎడెల్లి ఉప్పలయ్య, ఎడెల్లి ఇద్దయ్య, భాషిపంగు సునీల్, భాషిపంగు ఉప్పలమల్లు, పుల్లూరి ఉమా,బాషిపంగు శైలజ గోల్కొండ వెంకన్న, దరువు వెంకట్,పట్ల వంశీ,చిదుముల సంతోష్ తదితరులు ఉన్నారు.
