వేద న్యూస్,  హుస్నాబాద్:

హుస్నాబాద్‌లో ఇసుక మాఫియా దోపిడీని అరికట్టాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జి పచ్చిమట్ల రవీందర్‌గౌడ్ కోరారు. సోమవారం ఆ పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. 

హుస్నాబాద్ పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి ఇసుక తక్కువ ధరకు అందించాలని ప్రభుత్వం ఒక ట్రాక్టర్ టిప్పును  రూ.1400కు ఇచ్చేందుకు మైనింగ్ శాఖ కు అనుమతులు ఇచ్చిందని, హుస్నాబాద్ పట్టణంలో మొదటి విడతలో 144 ఇండ్లు వచ్చాయని చెప్పారు.  ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు బేస్మెంట్ లేవల్ వరకు కనీసం మూడు ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక అవసరం ఉంటుంది. ఇట్టి ఇసుకకు ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ. 6000కు ఇసుక మాఫియా దోపిడీ చేస్తున్నట్టు ఆరోపించారు. 

హుస్నాబాద్ చుట్టుపక్కల, పట్టణంలో ఇసుక డంపులు చేసి అధికారుల అండదండలతోనే ఇల్లు కట్టుకునే పేద, మధ్యతరగతి ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్  కు సమీపంగా ఉన్నవారు కూడా ఈ దందాలో పాత్ర ఉన్నట్టు తెలుస్తున్నదన్నారు .

వెంటనే ఇట్టి విషయంలో ఆర్డిఓ విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా బి ఎస్ పి పక్షాన కోరుతున్నట్టు తెలిపారు. మాఫీయా దోపిడీ ఆగకపోతే  పేదల పక్షాన బీఎస్పీ ఆధ్వర్యంలో ఆర్డిఓ ఆఫీస్ వద్ద ఆందోళన చర్యలు చేపడతామని హెచ్చరించారు.

కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, జిల్లా నాయకులు మారిశెట్టి సుధాకర్ ఎలగందుల శంకర్, జిల్లా ఇన్చార్జ్ డేగల వెంకటేష్, నియోజకవర్గ అధ్యక్షులు వేల్పుల రాజు, హుస్నాబాద్ మండల అధ్యక్షులు దుండ్ర రాంబాబు తదితరులు ఉన్నారు.