- షెడ్డు నిర్మించే వరకు తీసుకెళ్లం
- రైతు దంపతులు లలిత ఓదెలు
వేద న్యూస్, భూపాలపల్లి:
అధికారులు తమ గేదెల షెడ్డును కూల్చివేసినందుకు బాధితులు వినూత్న నిరసన తెలిపారు. ఏకంగా అధికార పార్టీ శాసన సభ్యుడి క్యాంప్ ఆఫీసులోనికే తమ గేదెలను తీసుకెళ్లడం గమనార్హం. బాధితురాలి వివరాల ప్రకారం..జయశంకర్ భూపాలపల్లి జిల్లా వేషాలపల్లి గ్రామంలోని తమ బర్ల షెడ్డును అధికారులు కూల్చేశారని, దాంతోనే తాము ఎమ్మెల్యే కార్యాలయానికి గేదెలతో వచ్చి నిరసన తెలిపామని రైతు దంపతులు కూరాకుల ఓదెలు, లలిత పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చెప్పినందుకే తమ గేదెల షెడ్డును అధికారులు అన్యాయంగా కూల్చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాము గేదెలను తీసుకెళ్లి నిరసన తెలిపామని వెల్లడించారు.
ఎమ్మెల్యే చెబితేనే కూల్చేశామని పోలీసులు చెప్తున్నారని, షెడ్డు లేకుండా తమ గేదెలు ఎక్కడ ఉండాలని పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి తీసుకోకుండా అతనికి ఓటు వేసినందుకు ఆయన తమకు ఇచ్చే బహుమతి ఇదేనా? అంటూ వారు నిలదీశారు. షెడ్డు నిర్మించే వరకు గేదెలను తీసుకెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.