వేద న్యూస్, హన్మకొండ:
హనుమకొండ అటవీ రేంజ్ అధికారి పెంటా బిక్షపతి పదవి విరమణ ఆత్మీయ సన్మానం గురువారం జరిగింది. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ(ఔల్స్) వారు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని వారిని ఆత్మీయంగా ఘనంగా సన్మానించారు. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ తో గత 8 ఏండ్లుగా ఎన్నో అటవీ సంరక్షణ కార్యక్రమాలను ఆయన కలిసి చేశారు.
అదే విధంగా హనుమకొండకు దగ్గరలో ఉన్న ఇనుపరాతి గుట్టలను రక్షించుటలో స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసుకొని ఎఫ్ఆర్ఓ భిక్షపతి గారు ముందుకు నడిచారు. ఆ రకంగా ఇప్పుడు ఉన్న ఇనుపరాతి గుట్టలను రక్షించుటలో ఆయన ముఖ్యపాత్ర వహించారని, తమను కూడా రక్షించడంలో అవకాశం కల్పించి ఇనపరాతి గుట్టలను ఇప్పటివరకు కాపాడగలరని ఔల్స్ వారు ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీసీఎఫ్. భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్ డాక్టర్ డి.బీమా నాయక్ ఐ.ఎఫ్.ఎస్. సర్కిల్ , జిల్లా అటవీ అధికారి కొత్తగూడెం కిష్టాగౌడ, ఐ.ఎఫ్.ఎస్, హనుమకొండ, వరంగల్, జనగాం జిల్లాల అటవీ అధికారి అనుజ్ అగర్వాల్, ఐఎఫ్ఎస్, హనుమకొండ జిల్లా అటవీ అధికారిణి బి.లావణ్య, ఐఎఫ్ఎస్, భద్రాద్రి సర్కిల్ ఫ్లైయింగ్ స్వాడ్ కృష్ణమాచారీ, హార్టికల్చర్ ఆఫీసర్ రమేష్, రేంజ్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, అటవీ శాఖ సిబ్బంది, బంధుమిత్రులు తదితరులు హాజరయ్యారు.