• కాసిపేట మండలంలో నామినేషన్ల హోరాహోరీ

వేద న్యూస్, కాసిపేట:

 మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ఉత్సాహం మంగళవారం రాత్రివేళ పుంజుకుంది. నామినేషన్ల చివరి రోజు కావడంతో అభ్యర్థులు, అనుచరులు భారీ సంఖ్యలో కేంద్రాలకు చేరుకున్నారు. అర్ధరాత్రి వరకూ క్యూలైన్లలో నిలబడి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం ఎన్నికల కోలాహలన్నీ మరింతగా పెంచింది.

 

మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు మంగళవారం ఒక్క రోజే సర్పంచ్ స్థానాలకు 78, వార్డు సభ్యుల స్థానాలకు 318 నామినేషన్లు సమర్పించగా, మొత్తం నామినేషన్ల గడువు ముగిసే సరికి 22 సర్పంచ్ పదవులకు 113 మంది, 190 వార్డు స్థానాలకు 393 మంది పోటీదారులు బరిలో నిలిచారు.

 

గ్రామాల వారీగా నామినేషన్ల వివరాలు:

 

కాసిపేట: సర్పంచ్ 6, వార్డులు 23

 

మామిడిగూడ: సర్పంచ్ 7, వార్డులు 10

 

సోమగూడెం (కే): సర్పంచ్ 4, వార్డులు 17

 

లంబాడితండా (కే): సర్పంచ్ 6, వార్డులు 20

 

ముత్యంపల్లి: సర్పంచ్ 3, వార్డులు 24

 

చిన్న ధర్మారం: సర్పంచ్ 4, వార్డులు 9

 

పెద్దనపల్లి: సర్పంచ్ 3, వార్డులు 20

 

కోమటిచేడు: సర్పంచ్ 9, వార్డులు 20

 

పల్లంగూడ: సర్పంచ్ 4, వార్డులు 16

 

బుగ్గగూడ (కే): సర్పంచ్ 2, వార్డులు 12

 

కోనూరు: సర్పంచ్ 6, వార్డులు 17

 

కొండాపూర్: సర్పంచ్ 9, వార్డులు 16

 

తాటిగూడ: సర్పంచ్ 5, వార్డులు 15

 

ధర్మారావుపేట: సర్పంచ్ 1, వార్డులు 11

 

లంబాడితండా (డీ): సర్పంచ్ 7, వార్డులు 17

 

మల్కెపల్లి: సర్పంచ్ 4, వార్డులు 20

 

రొట్టెపల్లి: సర్పంచ్ 2, వార్డులు 11

 

సోనాపూర్: సర్పంచ్ 3, వార్డులు 13

 

వెంకటాపూర్: సర్పంచ్ 2, వార్డులు 9

 

గట్రాంపల్లి: సర్పంచ్ 2, వార్డులు 15

 

దేవాపూర్: సర్పంచ్ 15, వార్డులు 59

 

చివరి రోజు అత్యధిక నామినేషన్లు దేవాపూర్, ముత్యంపల్లి, లంబాడితండా, కోమటిచేడు పంచాయతీల్లో నమోదయ్యాయి. నామినేషన్ కేంద్రాల వద్ద సందడి, అభ్యర్థుల ఊరేగింపులు, డప్పుల వాయిద్యాలు, మద్దతుదారుల నినాదాలు ఎన్నికల ఉత్కంఠను మరింత పెంచాయి.

పోలీసులు, రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణను క్రమబద్ధంగా నిర్వహించారు. నామినేషన్ల పరిశీలన అనంతరం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా విడుదల కానుంది