వేద న్యూస్, వరంగల్ క్రైమ్:

ఓ మర్డర్ కేసులో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎనుమాముల పోలీస్ స్టేషన్‌లో.. యూపీలోని హర్దోయి జిల్లా బిలగ్రామ్ మండలం కోయి గ్రామస్తుడైన రితేశ్ సింగ్ అలియాస్ పద్దుపై కేసు నమోదయింది. ఈ మేరకు పీఎస్ ఎస్‌హెచ్‌వో ఓ ప్రకటన రిలీజ్ చేశారు.  బీఎన్ఎస్ యాక్ట్ 103 (1) ప్రకారం సదరు యువకుడిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.  సదరు వ్యక్తి ఫొటోను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. 

సదరు వ్యక్తి (ఆక్యూజ్‌డ్) ఎక్కడైనా కనబడినా వెంటనే తమకు  ఈ ఫోన్ నంబర్లలో  8712685120 కు లేదా 8712685133, లేదా 8712685288, లేదా 8712685238 సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.