- సీఐటీయూ జిల్లా కోశాధికారి కే నర్సమ్మ ఆరోపణ
వేద న్యూస్, టేక్మాల్ :
మెదక్ జిల్లా టేక్మాల్ గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని, పండగ రోజు పస్తులు ఉండాలా ? ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను చెల్లించాలని సిఐటీయు జిల్లా కోశాధికారి కే నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం టేక్మల్ మండల కేంద్రం లో గ్రామ పంచాయతీ కార్మికుల ముఖ్య నాయకత్వం తో ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల కు గత 5 నెలల నుండి వేతనాలు ప్రభుత్వము చెల్లించడం లేదన్నారు.
సంవత్సరంలో ముఖ్యమైన పండగలు బతుకమ్మ,దసరా పండుగ సంబరాలు ప్రారంభం అయ్యాయన్నారు.ఉదయం నుండి సాయంత్రం వరకు గ్రామాలలో పారిశుద్య పనులు నిర్వహిస్తూ ఇదే పనిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం కార్మికుల ఉసురు తీస్తుందని అని అన్నారు.
పండగ పూట సిఎం మాత్రం పంచభక్ష పరమాన్నాలు తింటే కార్మికులు కనీసం పప్పు అన్నం తినడానికి కూడా వేతనాలు చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్ వేతనాలను చెల్లించాలని,లేనిపక్షంలో పండగ తర్వాత ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని ఆమె హెచ్చరించారు.
కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల మండల నాయకులు పెంటయ్య,మానయ్య,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.బ