వేద న్యూస్ , వరంగల్:

మధ్య తరగతి, నిరు పేద, సామాన్య ప్రజానీకం తమ అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఆశ్రయించే ప్రభుత్వ ఆస్పత్రులను అత్యంత పరిశుభ్రంగా ఉండేలా, మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం, సర్కారీ అధికారులు పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు. కాగా, నిరంతర పర్యవేక్షణ కొరవడటంతోనే సర్కారీ దవఖానాల్లో భిన్న పరిస్థితులు నెలకొంటున్నాయని అభిప్రాయపడుతున్నారు. 

 

రంగల్ నగరంలోని సీకేఎం ఆస్పత్రిలో గర్భిణులు స్కానింగ్ కు వెళ్లే క్రమంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ప్రతీ సారి కొంత నగదు చేతికి అందితేనే స్కానింగ్ చేస్తున్నారని చెబుతున్నారు

సదరు ఆస్పత్రి సిబ్బంది స్కానింగ్ కు వెళ్లే ముందర లైన్ లో వెయిట్ చేస్తున్న ప్రతి గర్భిణి వద్దకు వచ్చి.. వారి అటెండెంట్స్ ను డబ్బులు అడుగుతున్నారు. నగదు ఎంతో కొంత ఇవ్వాలని, ఒకసారి కి ఇస్తే సరిపోదని, స్కానింగ్ కు వచ్చిన ప్రతీ సారి ఇవ్వాల్సిందేనని అడుగున్నారని పేషెంట్ అటెండెంట్స్ వాపోతున్నారు. 

స్కానింగ్ కు వెళ్లిన సమయంలో లోపల.. ల్యాబ్ లో కూడా ఉండేది తామేనని, డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారు. డబ్బులు ఇవ్వని పక్షంలో దూషణలకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. కాగా, ఆస్పత్రిలో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే సిబ్బంది వసూళ్లు బహిరంగంగానే కొనసాగుతున్నాయనే వాదన లేకపోలేదు.