= లిఫ్ట్ దగ్గర అంతా చెత్తాచెదారం
వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లిఫ్ట్ సమీపంలో చెత్త పేరుకుపోవడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయం పరిశుభ్రతకు ఆదర్శంగా ఉండాల్సిన చోటే చెత్త కుప్పలు కనిపించడం విమర్శలకు దారి తీస్తోంది. ప్రతిరోజూ తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, ఉద్యోగులు చెత్త దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అధికారులు గమనించినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్తను తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.