వేద న్యూస్, ముస్తాబాద్ :
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ముస్తాబాద్ మండల నామాపూర్ గ్రామం లోని తెలంగాణ మోడల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాలలోని తరగతి గదులు, టాయిలెట్స్, స్టోర్ రూమ్ లను స్వయంగా తిరిగి పరిశీలించారు. విద్యార్థులచే హిందీ ఇంగ్లిష్ పాఠాలను చదివించి.. పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబాట్టారు.
స్కూల్ లోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించి.. వారు ఏమి తిన్నారు ఎలా ఉంది ఫుడ్ అని అడిగి తెలుసుకుని, టేబుల్ టెన్నిస్ గేమ్స్ ఆడాలని పేర్కొన్నారు. హాజరు వివరాలు స్వయంగా పరిశీలించి.. అటెండెన్స్ వివరాలు తెలుసుకున్నారు.