వేద న్యూస్, హనుమకొండ ప్రతినిధి : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 31వ డివిజన్ ఇన్‌చార్జ్‌గా తనకు బాధ్యతలు అప్పగించి నమ్మకం ఉంచిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి, బట్టి శ్రీనివాస్‌కు, తాజా మాజీ కార్పొరేటర్ మామిండ్ల రాజుకు, డివిజన్ ఇన్‌చార్జ్ మార్క విజయ్‌కు, డివిజన్ అధ్యక్షుడు సత్తు రమేష్‌కు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు డీసీసీ నాయకుడు మామిండ్ల సురేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తూ, అదే ఉత్సాహంతో, పట్టుదలతో పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మామిండ్ల సురేష్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *