వేదన్యూస్ వరంగల్

కుల, మత, రాజకీయ భేదాలకు అతీతంగా మన దసరా ఉత్సవాలను ఐకమత్యంతో, వైభవంగా నిర్వహించుకుందాం.

ఎనుమాములలో  దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు దసరా ఉత్సవ సమితి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో శ్రీ సయ్యద్ ఇంతియాజ్ , శ్రీనివాస్ , స్టాలిన్ మన 14వ డివిజన్‌కు చెందిన వెలిగేటి రవికుమార్ ని సంప్రదించగా రవి కుమార్ దసరా ఉత్సవాల నిర్వహణ కోసం తన వంతు సహకారంగా హైడ్రాలిక్ స్టేజ్‌ను అందించేందుకు దాతగా ముందుకు రావడం జరిగింది.

ఈ సందర్భంగా నిన్న జరిగిన ఏనుమాములలో జరిగిన గోర అగ్ని ప్రమాదంలో  తన వంతు సహాయంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి  jcb స్వయంగా నడిపి తనవంతు సహాయం చేసిన సందర్భంగా   వర్ధన్నపేట ఎమ్మెల్యే KR.నాగరాజు వెలిగేటి రవికుమార్ ను శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ గారు, 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్ గారు, ఎస్.ఆర్. నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్టాలిన్ గారు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *