వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి:
నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నల్గొండ, సూర్యాపేట,యాదాద్రి భువనగిరి జిల్లాల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికోమటిరెడ్డి వెంకటరెడ్డి ,శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ రామ్,నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి,
నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం,నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి,మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో బీసీ గురుకులాలకు నూతన హాస్టల్ బిల్డింగ్స్ ఏర్పాటు చేయాలని కోరారు.అలాగే గురుకులాల్లో ఖాళీలను గుర్తించి మా మిర్యాలగూడ నియోజకవర్గ నిరుపేద విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.