ఇందిరమ్మ రాజ్యం నిర్మాణమే మా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బీఎల్ఆర్

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి:

మిర్యాలగూడ పట్టణంలోని ఎస్వీ గార్డెన్స్ నందు శుక్రవారం సాయంత్రం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఇందిరా మహిళా శక్తి సంబురాలు కార్యక్రమంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి(బీఎల్ఆర్). ఈ సందర్భంగా మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీలేని ఋణాల చెక్కుల పంపిణీ లోన్ భీమా ప్రమాద భీమా చెక్కుల పంపిణీ బ్యాంక్ ఋణాలు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళా ప్రభుత్వం అనడానికి గడిచిన 18 నెలల్లోనే మహిళకు అందించిన సంక్షేమాలు చూస్తే అర్ధం అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం నిర్మించేందుకు మహిళలను శక్తి వంతులుగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారు అని అన్నారు..

మహిళకు ఉచిత బస్సు ప్రయాణం,500 రూపాయల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ,200 యూనిట్ల ఉచిత విద్యుత్..

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే ప్రణాళిక.
మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు.
మహిళా సంఘాలకు పెట్రోల్ బంకుల నిర్వహణ.
మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సుల నిర్వహణ.
మహిళా సంఘాలకు మొబైల్ చేపల విక్రయ వాహనాలు.
మహిళా సంఘాలకు ఇటుక బట్టీల తయారీ పరిశ్రమలు.
మహిళా సంఘాలకు స్కూల్ లు, హాస్టల్ లలో ఫుడ్ భాధ్యతలు.
మహిళా సంఘాలకు 21 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది.ఇక మీద ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల చొప్పున వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం.,మహిళలకు భద్రతగా నిలుస్తున్న టీ సేఫ్ యాప్.
తొలి మహిళా కమాండో బృందం టీం శివంగి
ఇలా ఎన్నో పథకాలు ఎన్నో సంక్షేమాలు మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.