వేద న్యూస్, ఇల్లంతకుంట:
అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రిజర్వేషన్లు కాప్ ఎత్తివేస్తూ బిసి లకు 42 శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అమలు చేసేందుకు బిల్లు ఆమోదించినందుకు మానకొండూర్ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినయ్ కుమార్ మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే,లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వర్గానికి ధన్యవాదాలు తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేస్తామని చెప్పిన విధంగా అమలు చేశారని పేర్కొన్నారు.రాబోయే స్థానికి సంస్థల ఎన్నికల్లో అత్యధిక జెడ్పి చైర్మన్లు,యంపిపి లు బిసి లు అయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.