•  కాంగ్రెస్ బీసీ నేత కొలిపాక శ్రీనివాస్ హెచ్చరిక 

వేద న్యూస్, కరీంనగర్:

దక్షిణ భారతదేశంలో ఎంపీ సీట్లు తగ్గిస్తే కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం తప్పదని కాంగ్రెస్ బీసీ నేత కొలిపాక శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు.

దక్షిణరాష్ట్రాల్లో అగ్రగామిగా విరాజిల్లుతున్న తెలంగాణకు రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను దేశరాజధాని చేయాలని కోరారు. డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన చేసి ఉత్తరాదిన సీట్లు పెంచుకుని, దక్షిణాదిన లోక్‌సభ సీట్లు తగ్గించేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌ను దేశ రాజధాని చేయాలని దక్షిణాది రాష్ట్రాల సీఎంల తరఫున డిమాండ్ చేస్తు్న్నట్టు పేర్కొన్నారు.