Congress leader warns big producer..!Congress leader warns big producer..!

వేదన్యూస్ – ఫిల్మ్ నగర్

హెచ్ సీయూ వివాదంపై సినిమా ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు నాగ్ అశ్విన్, ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయి, ప్రియదర్శి లాంటి వాళ్ళే కాకుండా చిన్న బడా అంటూ తేడా లేకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరూ స్పందించి.. యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి మద్ధతుగా నిలిచిన సంగతి తెల్సిందే. ఈ అంశంపై స్పందించిన సినిమా ఇండస్ట్రీకి చెందిన నటులకు వార్నింగ్ ఇవ్వమని ఇండస్ట్రీకి చెందిన.. ఇండస్ట్రీని లీడ్ చేస్తున్న ఓ పెద్ద నిర్మాతకు  అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత.. సీఎం కు అత్యంత ఆప్తుడైన ఓ నేత కాల్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సదరు సినీ పెద్దకు ఆ ముఖ్య నేత కాల్ చేసి సినిమావాళ్లకు రాజకీయాలతో సంబంధం ఏంటి..? . హెచ్ సీయూ భూముల వ్యవహారంలో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు. మీ పని మీరు చేసుకోకుండా ఎందుకు వ్రేలు పెడుతున్నారు. మీ లొసుగులు మాకు ఎరుక. మీ అంతు చూస్తాము .. సమయం వచ్చినప్పుడు జాగ్రత్త అంటూ బెదిరించారని సదరు నిర్మాత  ఇండస్ట్రీ ముఖ్యుల దగ్గర వాపోయినట్లు తెలుస్తుంది.

కంచగచ్చిబౌలి లో ఉన్న నాలుగు వందల ఎకరాల్లో చెట్లను కూల్చివేతపై స్పందించిన సినీ ప్రముఖులను అదుపులో పెట్టుకోవాలి. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎవరూ అని చూడము తోలు తీస్తామని వార్నింగ్ ఇస్తూ ఇండస్ట్రీని లీడ్ చేస్తున్న బడా ప్రముఖ నిర్మాతకు కాల్ చేసి హెచ్చరించినట్లు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.