వేద న్యూస్, బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రం నుండి కోదురుపాక వెళ్లే ప్రధాన రహదారి దేశాయిపల్లి గ్రామంలోని వరద కాలువ వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు దెబ్బతిన్నాయి. దీంతో సోమవారం చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు గుంతల్లో మట్టి పోయించి తాత్కాలిక మరమ్మతులు చేయించారు.
చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం సూచన మేరకు శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు ఇప్పటికే రూ.35 లక్షల బీటి రోడ్డు కు ఎస్టిమేషన్ వేసి టెండర్ల ప్రక్రియ ముగియగానే, శాశ్వతంగా రోడ్డు నిర్మాణం చేపడుతారని నాయకులు వెల్లడించారు.
కార్యక్రమంలో బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లేష్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కౌడగాని వెంకటేష్, మాజీ సర్పంచ్ మడిశెట్టి జనార్దన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమిరెడ్డి సురేందర్ రెడ్డి, కొనుకటి మధుకర్, దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.