వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి/ ఇల్లందకుంట:
కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ మార్గదర్శనంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి సైనికుడిగా పార్టీ ఇల్లందకుంట మండల అధ్యక్షుడు పెద్ది కుమార్ కృషి చేస్తున్నారు. నిత్యం పార్టీ తరఫున వాయిస్‌గా నిలబడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పార్టీ లైన్‌ను ప్రజలకు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.

నేటి తరానికి మూడు రంగుల పార్టీ (కాంగ్రెస్) లైన్‌ను సూటిగా, స్పష్టంగా వివరించేందుకు వాట్సాప్ వేదికగా రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి ప్రాధాన్యతనిస్తున్నారు. హస్తం పార్టీ బలోపేతమే లక్ష్యంగా .. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు పార్టీ మండల అధ్యక్షుడు కుమార్ వెల్లడిస్తున్నారు.