- రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం
- కేంద్రం రాష్ట్రాల మధ్య త గవుపెట్టకుండా బాధ్యతగా వ్యవహరించాలి
- సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి
వేద న్యూస్, మఠంపల్లి:
ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాజకీయ జోక్యం తగదని సిపిఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు రంగారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ అధికార,ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని భావించాలని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కొరకు ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికను అఖి పక్షాన్ని పిలిచి ప్రజలందరికీ తెలిసేలా నిజానిజాలు వివరించాలని తెలిపారు.బనకచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటు తేల్చకుండా ఇరు రాష్ట్రాల మధ్య తగువపెట్టేలా వివరించడం సరైంది కాదన్నారు.ప్రాజెక్ట్ లు సకాలంలో పూర్తి చేయకపోవడంతో ఎస్టిమేషన్లు పెరిగి ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు.
ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితులను సమాజానికి తెలియజేయాలని బనకచర్ల ప్రాజెక్టు విషయంలో జలవనరుల శాఖ,కేంద్ర ప్రభుత్వం,ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సాంకేతికంగా, నికరజలాలు,మిగులు జలాలు, తెచ్చిన తర్వాతనే ముందుకు పోవాలని సూచించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని లిఫ్ట్ లన్ని ప్రాజెక్టు అంతర్భాగంలో చూడాలని పూర్తి నిర్వహణ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు.
ఎస్ ఎల్ బి సి టన్నల్ ప్రాజెక్టు పనులను పూర్తిచేసేందుకు కావలసిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో రైతులకు కావాల్సిన యూరియా కొరత లేకుండా అందుబాటులో ఉంచాలన్నారు.రాష్ట్రంలో గిరిజనులు, గిరిజనేతరులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలి వాళ్ళని డిమాండ్ చేశారు.
సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్య పాండు నాయక్, పల్లె వెంకటరెడ్డి,వట్టేపు సైదులు,మండల కార్యదర్శులు మాలోత్ బాలునాయక్, పోసనబోయిన హుస్సేన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శ్రీను,అంజి తదితరులున్నారు.
