O
*రూ. 10 లక్షల విలువైన చెక్కు అందించిన కలెక్టర్*
వేద న్యూస్ , సిరిసిల్ల: ఇల్లంతకుంట మండలం నర్సక్క పేటకు చెందిన ముత్యం వెంకటేశం కుటుంబానికి మంజూరైన పరిహార చెక్కును కలెక్టర్ శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అందజేశారు. ఇల్లంతకుంట మండలం నర్సక్క పేటకు చెందిన ముత్యం వెంకటేశం ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశమైన సౌదికి వెళ్లాడు. అనారోగ్య కారణాలతో మరణించాడు. వెంకటేశం పని చేసిన కంపెనీ నుంచి పరిహారం రూ. 10, 81,121 చెక్కు వచ్చింది. ఈ సందర్భంగా వెంకటేశం బార్య ముత్యం పద్మకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చెక్కు అందజేశారు.