- జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా
వేద న్యూస్, జీడబ్ల్యూఎంసీ:
డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు వారం రోజుల పాటు గ్రేటర్ వరంగల్ లోని 66 డివిజన్లలో (డిసెంబర్ 31, జనవరి 1 సెలవు రోజులు మినహా) దరఖాస్తులు స్వీకరిస్తామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా తెలిపారు. అభయహస్తం 6 గ్యారంటీల కోసం కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలని సూచించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం గడప గడప కు వెళ్లి దరఖాస్తు ఫారాల అందజేత, స్వీకరణ ఉండదన్నారు. ఆయా డివిజన్లలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తులు సమర్పించి, రసీదు పొందాలని స్పష్టం చేశారు. డివిజన్ లలో ఏర్పాటు చేసిన నిర్దేశిత కేంద్రాల్లో అప్లికేషన్స్ స్వీకరిస్తామని, బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ తీసిన ఫారం ద్వారా కుడా దరఖాస్తు చేసుకోవచ్చుని చెప్పారు.
బల్దియావ్యాప్తంగా ఉన్న 66 డివిజన్ లలోని ఏ కేంద్రం లోనైనా పూర్తి చేసిన దరఖాస్తులు సమర్పించవచ్చునని, రేషన్ కార్డు ఉంటేనే దరఖాస్తు చేయాలి అనే నిబంధన లేదని చెప్పారు. ఆధార్ కార్డ్ జిరాక్స్ ద్వారా కూడా అప్లయ్ చేసుకోవచ్చుని వెల్లడించారు. వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. అందజేసే ప్రతి దరఖాస్తు ను స్వీకరిస్తామని, దరఖాస్తుదారుల నుండి జిరాక్స్ కేంద్రాల యాజమాన్యాలు పెద్ద మొత్తం లో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.