వేద న్యూస్, వరంగల్ టౌన్:
వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. సోమవారం తూర్పు నియోజకవర్గం లోని ఉర్సు, రంగసాయిపేట, సుభాష్ నగర్ 182 కమిటీ సభ్యులు ఇంటింటికి కాంగ్రెస్ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పద్మ జనార్ధన్, మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు విలాసాగరం సంధ్య, 42వ డివిజన్ మహిళ అధ్యక్షురాలు విజయ, బలిగొట్టు అనిల్, విలాసాగరం శ్రీను, పాలకుర్తి సుమన్, తాళ్లపల్లి సందీప్ ,చిట్ల మల్లికాంబ, తాళ్లపల్లి రాజేశ్వరి, అడ్డగట్ల సుజాత, ముత్తినేని అనిత, కార్యకర్తలు పాల్గొన్నారు.