వేద న్యూస్ , రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి డీపీఆర్ఓ వీ శ్రీధర్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారుల మిత్రుల సంఘం వాట్సాప్ గ్రూప్ నందు ఓ కార్టూన్ డీపీఆర్ఓ షేర్ చేసిన విషయమై ప్రస్తావిస్తూ కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆఫీసర్స్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూపులో అధికారులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు వ్యతిరేకమైన పోస్టులు షేర్ చేసి .. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు టీసీఎస్(సీసీ&ఏ) రూల్స్ 1991 సబ్ రూల్(1) కింద సస్పెండ్ చేస్తున్నట్టు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ నెల24(బుధవారం) రోజునే ఐటెంను డీపీఆర్‌వో సదరు గ్రూపులో పోస్టు చేసినట్టు వెల్లడించారు.
బాధ్యత గల అధికారిగా ఉండి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారుల సంఘంకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులో సదరు సంఘం, ప్రభుత్వ విప్‌నకు వ్యతిరేకంగా వి.శ్రీధర్ పోస్టు చేసినట్టు తెలిపారు. ఈ విషయమై విచారణ అనంతరం తగు చర్యలను తీసుకున్నట్టు కలెక్టర్ సస్పెన్షన్ ఆర్డర్‌లో స్పష్టం చేశారు.
తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్, (సీసీ అండ్ ఏ) రూల్స్ 1991 ప్రకారం.. వి.శ్రీధర్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు.. వెల్లడించారు. సదరు వ్యక్తి డీపీఆర్‌వో అధికారిక సిమ్, ఫోన్‌ను కలెక్టరేట్‌లో ఏవోకు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు శ్రీధర్ రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఎక్కడికి వెళ్లకూడదని, ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు.
24 గంటల్లోనే కలెక్టర్ యాక్షన్.. పోస్టు చేసిన గంటల వ్యవధిలో అధికారిపై వేటు..!?