వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణ మరియు మండల పరిధిలోని ఓటర్ల నమోదు మార్పులు,చేర్పులు,బీఎల్ఓ యాప్ తదితర విషయాలపై మంగళవారం బూత్ లెవెల్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ సూపర్వైజర్స్ కు జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సబ్- కలెక్టర్, ఈ ఆర్ ఓ (ఎలక్ట్రాన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) అమిత్ నారాయణ మాలెంపాటి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని అధికరణ 324, 325, 326 ప్రకారము మరియు ఎన్నికల సంఘ నియమావళిని అనుసరించి 1 జూలై వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని అన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయకుండా ఉండడం అనేది రాజ్యాంగ విరుద్ధమని అందుకే జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి బి ఎల్ ఓ లకు మాస్టర్ ట్రైనర్లచే శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. ప్రతి బిఎల్ఓ ప్రాంతంలో ఉన్న అన్ని విషయాలపై సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉండి ఫామ్ 6,7,8 లకు సంబంధించిన ఓటర్ల నమోదు పై అవగాహన ఏర్పరచుకొని క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తప్పులు లేని,పరిపూర్ణమైన ఓటర్ల జాబితాను నమోదు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శర్మ ఎన్నికల నాయబ్ తహసీల్దార్ ప్రవీణ్, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్స్ గుడిపాటి కోటయ్య, పోలెబోయిన జనార్ధన్,అంబటి శ్రీను,గోవర్థన్ రెడ్డి,సైదిరెడ్డి, ఉస్మాన్ తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది సత్యనారాయణ, రామకృష్ణ, రవీందర్ రెడ్డి సూపర్వైజర్లు,బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.