వేద న్యూస్,శాయంపేట:

దేశవ్యాప్తంగా జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపునకు ఐఎన్టియుసి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు.వేతన చెల్లింపుల చట్టాలతో పాటు 44 చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు తెలియజేశారు. సమ్మెలో కార్మికులు , ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జూలై 9న బుధవారం కేంద్ర కార్మిక సంఘాలతో పాటు జరిగే ఆందోళనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేసారు. కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహించే ధర్నాలు, ప్రదర్శనలు ఇతర ఆందోళన కార్యక్రమాల్లో భాగస్వాములం కావడం ద్వారా కార్మికుల ఐక్యతను ప్రదర్శించాలన్నారు.వేతన చెల్లింపు చట్టాల పునరుద్ధరణ కాపాడుకునేందుకు అందరూ ఐక్యంగా నిరసన చెప్పాలని ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ పిలుపు ఇచ్చారు.