వేద న్యూస్ , హన్మకొండ :

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్ కాంగ్రెస్ యువ నాయకులు సయ్యద్ ఆఫ్సర్ పాష అన్నారు. మంగళవారం డివిజన్ లోని వాడ వాడ తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డినీ గెల్పించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి కి ఓటు వేయాలంటే కాంగ్రెస్ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కార్మికులకు, వాడ ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు.

ఈ సందర్భంగా అఫ్సర్ మాట్లాడుతూ, కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సుపరిపాలన సాధ్యం అని, కాంగ్రెస్ ప్రకటించిన మానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందేలా రూపొందించడం జరిగిందని తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ది జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.