వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: 

 

హనుమకొండ రాయపుర లోని ప్రముఖ నటుడు, హాస్యనటుడు మరియు వరంగల్ మున్సిపాలిటీ స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ రచ్చ రవి నివాసంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎండీ ఆయుబ్ ని ఘనంగా సన్మానించడం జరిగింది.

రచ్చ రవి కమెడియన్‌గా ఎదగకముందు వరంగల్ మున్సిపాలిటీలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన సమయంలో, అదే కాలంలో ప్రస్తుత వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎండీ ఆయుబ్ కాంగ్రెస్ పార్టీ లో చిన్న కార్యకర్తగా ఉన్నారు. ఆ రోజుల్లో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహబంధం ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది.

రచ్చ రవి తన ప్రతిభతో సినీ రంగంలో మరియు జబరదస్త్ తో గుర్తింపు తెచ్చుకొని, ప్రస్తుతం వరంగల్ మున్సిపాలిటీ స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న రచ్చ రవి ఒకవైపు మరోవైపు ప్రజాసేవలో నిరంతరం ముందుండి కష్టసుఖాలో కార్యకర్తలకు అండగా ఉండి ఇంటి పేరునే కాంగ్రెస్ గా మార్చుకొని అందరికి కాంగ్రెస్ అయూబ్ గా సూపరిచితుడై కార్యకర్త నుండి చారిత్రమక మైన వరంగల్ జిల్లా కు అధ్యక్షుడు అవడం అభిమానందనీయం.

ఇద్దరు అటు రచ్చ రవి ఇటు అయూబ్ ఎదిగిన తీరు గర్వనీయం అని ఒకరికి ఒకరు అభినందనలు తెలుపుతూ తమ గత స్మృతులను నెమరు వేసుకోవడం జరిగింది. రచ్చ రవి తల్లితండ్రులతో పాటు వరంగల్ జిల్లా కళాకారుడు జిల్లా అధ్యక్షుడు అయూబ్ ను సన్మానించుకోవడం జరిగింది.