వేద న్యూస్, వరంగల్:
దామెర ఎంపిడిఓ గా గజ్జెల విమల సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఆమెను పంచాయతీ కార్యదర్శుల ఫోరం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ ఆధ్వర్యంలో సెక్రటరీలు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఫోరం రాష్ర్ట ఈ. సి.మెంబర్ అర్షం శ్రీనివాస్, జిల్లా జాయింట్ సెక్రటరీ శివ శంకర్,ఉపాధ్యక్షులు మనోహర్,డివిజన్ అధ్యక్షులు వేణు మాధవ్,కార్యదర్శులు సందీప్,సిరివెన్నెల, రజిత,కవిత,పద్మ,సుకన్య,రామ్మూర్తి,మనిదీప్ ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.