వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట మండలం తనుగుల గ్రామ పంచాయతీ సర్పంచ్ జెక్కే కిరణ్ ,ఉప సర్పంచ్ అంబాల స్వప్న రజనీకాంత్ , గౌరవ వార్డు సభ్యులకు.. హుజురాబాద్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వొడితల ప్రణవ్ శుభాకాంక్షలు తెలియజేసి సన్మానం చేశారు.
ప్రణవ్ మాట్లాడుతూ..గ్రామాల్లో నెల కొ న్న సమస్యలకు,వాటి పరిష్కారానికి వారధిగా గ్రామ సర్పంచుల పాలన కొనసాగించాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కోరారు.
సోమవారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల గ్రామాల్లో నూతనంగా కొలువుదిరిన గ్రామ పంచాయతీల పాలకవర్గ నూతన ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..గ్రామాల్లో సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని,సమస్యలపై ఈ ప్రాంత బిడ్డగా తన దృష్టికి తీసుకొస్తే మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఎక్కువ నిధులు కేటాయిస్తామని తెలిపారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అనేక సంక్షేమ అభివృద్ధి జరిగిందనీ గ్రామాల్లో కూడా అదే రకమైన పాలన కొనసాగించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

