వేద న్యూస్, నాగర్ కర్నూల్ :
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అండ్ రేంజ్ ముక్డికిగుండం గ్రామ పరిసర ప్రాంతంలో అమ్రాబాద్ ఫారెస్ట్ భూమిని కొందరు ఆక్రమిస్తుండగా, అటవీ శాఖ సిబ్బంది అడ్డుకోగా సదరు సిబ్బందిపై దాడి జరిగిన నేపథ్యంలో అటవీ శాఖ సీరియస్‌గా సమాధానం చెప్పింది.
ఒక ఉద్యోగిపై దాడికి నిరసనగా వందమందికి పైగా అటవీశాఖ సిబ్బంది గురువారం కవాతు నిర్వహించి మొక్కలు నాటారు. అక్రమార్కులకు ఆట కట్టడికి తగ్గేదేలే అనే సంకేతాన్ని పంపింది.
ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సిబ్బందిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేయగా, స్పందన సరిగా రాలేదు. తూతూ మంత్రంగా పోలీసుల వ్యవహారం ఉండటంతో..అటవీ శాఖ వారు 150 మందికిపై ఫోర్స్ తో వచ్చి.. సదరు గ్రామంలోనే కవాతు చేయడం తో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశారు.
డీఎఫ్‌ఓ రోహిత్ గోపిడి ధైర్యసాహసాలతో అక్కడికి సిబ్బందితో కలిసి వెళ్లి 50 ఎకరాలకు పైగా భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఆక్రమణ జరిగిన ఫారెస్ట్ భూమిని కూడా తిరిగి స్వాధీనపరచుకున్నారు. 300 ఎకరాల అటవీ శాఖ భూమిని రికవరీ చేయుటకు ప్రణాళిక సిద్ధం చేశారు.
50 ఎకరాలకు పైగా అటవీ భూమి తిరిగి స్వాధీనం.. డీఎఫ్‌వోకు సెల్యూట్
