Kunduru JanareddyKunduru Janareddy

త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ జాతీయ నాయకులు కేసీ వేణుగోపాల్ కు లేఖ రాసిన సంగతి తెల్సిందే. ఆ లేఖలో ఫలాన వాళ్ళకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని పేర్లు ప్రస్తావించలేదు. కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరువురికి చెక్ పెట్టడానికి మాజీ మంత్రి జానారెడ్డి లేఖ రాశారని పాలిటిక్స్ వర్గాల్లో టాక్.

ఇప్పటికే బెర్తులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ముదిరాజు,బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శ రెడ్డిలకు ఖరారైనట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఈ తరుణంలో జానారెడ్డి లేఖ రాయడం పెనుసంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే తమ ఇంట్లో ఇంకో మంత్రి పదవి కావాలని ఆరాటపడుతున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు చెక్ పెట్టే విధంగా జానారెడ్డి సరికొత్తగా ఈ అంశాన్ని లేవనెత్తారని గుసగుసలు విన్పిస్తున్నాయి.

ఉమ్మడి నల్గోండ జిల్లాకు రెండు మంత్రి పదవులు ఉండటంతో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, రామోహాన్ రెడ్డి,మనోహార్ రెడ్డిలు మంత్రి పదవుల కోసం పోరాడుతున్నారు. మరోవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సైతం అవకాశం కల్పించాలని ఆ నియోజకవర్గ నేతలు ఆశపడుతున్నారు. జానారెడ్డి ఎవరికివ్వాలనేది స్పష్టంగా చెప్పకపోయిన ఈ రెండు జిల్లాల నుండి ఎమ్మెల్యేలలో  ఎవరికోకరికి మంత్రిగా అవకాశం ఇవ్వాలని కోరారని ఆర్ధమవుతుంది. నల్గోండ జిల్లా మంత్రులకు చెక్ పెట్టడానికి జానారెడ్డి ఇలా ప్లాన్ చేశారని రాజకీయ విశ్లేషకుల అంచనా.