కంటి, చెవి, ముక్కు గొంతు సమస్యల వారికి.. ఫ్రీ హెల్త్ క్యాంపు
వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని వీణవంక రోడ్డు ఎస్బీఐ బ్యాంకు పక్కన ‘వేద’ కంటి, చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రి ఆధ్వర్యంలో రేపు(ఆదివారం) నర్సింగాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ సాయినేత్ర తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
ఆదివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నర్సింగాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఉచిత కంటి, ఈఎన్‌టీ హెల్త్ క్యాంపు నిర్వహించనున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ టి.వెంకట్ సాయి నేత్ర ఎంబీబీఎస్ ఎంఎస్(ఆప్తమాలజీ), చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డాక్టర్ ఎస్.నిఖిత దంపతులు క్యాంపులో అందుబాటులో ఉండనున్నారు.